ఏపీ ప్రభుత్వం రూ.1,900 కోట్ల రుణ సేకరణ

భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీ ప్రభుత్వం రూ.1,900 కోట్ల రుణ సేకరణ

రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని రూ.1,900 కోట్ల రుణం సమీకరించింది.

రూ. 1000 కోట్లను 11 ఏళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా 7.27% వడ్డీకి తీసుకుంది.

మరో రూ.900 కోట్లను ఎనిమిదేళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా 7.14% వడ్డీకి సమీకరించింది.

ఈ మొత్తం బుధవారం నాటికి రాష్ట్ర ఖజానాకు జమవుతుంది.