భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ బ్రాండ్ అంబాసిడర్ కు అక్టోబర్ 15 వరకు గడువు
అమరావతి :
‘ఏపీ బ్రాండ్ అంబాసిడర్’ నమోదుకు ముగింపు గడువు దగ్గర పడుతోంది. వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్ర విజన్-2047లో యువతను భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ‘ఆంధ్ర యువ సంకల్ప్ 2K25’ డిజిటల్ మారథాన్కు ఆహ్వానం పలికింది. సెప్టెంబర్ 30తోనే గడువు ముగియగా, కాలేజీల విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. ఇప్పటికే ఈ మారథాన్లో లాగిన్ చేసుకొని 715 వీడియోలు, షార్ట్స్ పంపారు.
