గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఏపీ శాసనసభలో గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.

ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా పిలుస్తారు.

గురువారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో పనిచేస్తోందని, ఈ విజన్‌కు అనుగుణంగా సచివాలయాల విధుల్లో మార్పులు చేశామని మంత్రి వివరించారు.

అందుకు తగినట్లుగా సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణను ప్రతిపాదించినట్లు తెలిపారు.