భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల ఉమ్మడి నీటి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యాంనకు మరో ముప్పు ముంచుకొచ్చింది. తుంగభద్ర ఆనకట్టలోని 19 నంబరు గేటుకు ఇటీవల మరమ్మతులు నిర్వహించారు. అయితే ఈ గేట్ గత ఏడాది ఆగస్టు 10 న కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుండి తాత్కాలిక స్టాప్-లాగ్ గేట్‌ను ఏర్పాటు చేసి, పనులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిది లీక్ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
