భారత్ న్యూస్ శ్రీకాకుళం….నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు ఏపీఎస్డీఎంఏ తెలిపింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం సమయంలో పొలంలో ఉండరాదని, చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది…
