ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

..భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

➤ పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, ఏపీ సీఆర్డీఏ, అమరావతి రాజధాని ఏరియా మినహా ఇతర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన ఆమోదం

➤ కేబినెట్ సమావేశంలో మొత్తం 13 బిల్లులను చర్చించి ఆమోదం

➤ నాలా ఫీజు రద్దుకు సంబంధించిన చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం

➤ అమరావతి పరిధిలో 343 ఎకరాల భూమి సేకరణకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

➤ఓటర్ల జాబితా సిద్ధం కోసం మూడు కొత్త తేదీలను ఖరారు చేయాలని నిర్ణయం