భారత్ న్యూస్ అనంతపురం…ఈరోజు కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం గారి నివాస కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్.బి. అంజాద్ భాష గారు….
గత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 54వేల బెల్ట్ షాప్ లను రద్దు చేశాం..
రాష్ట్రంలో మద్యం ఎరులై పారుతోంది..
కుటీర పరిశ్రమ పేరిట నకిలీ మద్యం తయారీ..
మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు..
నాడు ఎన్టీఆర్ సంపూర్ణ మద్యపానం అమలు చేస్తే తిరిగి మద్యం విక్రయాలను ప్రారంభించిన చంద్రబాబు..
చంద్రబాబు విషనరీ నాయకుడంటే బహుశా ఇదేనేమో..
పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తారని భావించారు..
కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్నారు
ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం..
వేల కోట్ల నకిలీ మద్యం వ్యాపారం సాగిస్తున్నారు..
ఎంత పకడ్బందిగా మద్యం తయారు చేస్తున్నారో బట్టబయలు అయ్యింది..
లభ్యమైన బాటల్స్, స్టికర్స్ చూస్తే ఏ రకంగా ప్యాకింగ్ చేస్తున్నారో అర్ధమౌతోంది..
ప్రతీ మూడు బాటల్స్ లో ఒక నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు..
మిషనరి చూస్తేనే అర్ధమౌతుంది ఎంత పకడ్బందిగా మద్యం తయారీ చేస్తున్నారు..
నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు
జయచంద్ర రెడ్డి తంబళ్లపల్లి నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఇంచార్జి గా వ్యవహారిస్తున్నారు..
ఈ గవర్నన్స్ ద్వారా చీమ చిట్టుక్కుమన్న తెలిసిపోతుందన్నారు..
మరి ఇంత పెద్ద స్థాయిలో మద్యం తయారీ చేస్తుంటే పెద్ద బాబు, చిన్న బాబు కు తెలియకుండా సాగుతుందా..
నకిలీ మద్యం పెద్ద, చిన్న బాబులకు తెలిసే సాగుతోంది..
6700 కొట్లు మద్యం జరిగితే
6వేల 990కోట్లకు మాత్రమే పెరిగింది.. ఎందుకు వృద్ధి రేటు పెరగలేదు..
వృద్ధి రేటు పెరగకపోవడానికి నకిలీ మధ్యమే కారణం
మొలకల చెరువులో నకిలీ మద్యం తయారు చేస్తే పట్టుకుంటే ఆ అధికారిణి ని సస్పెండ్ చేశారు..
రివార్డ్స్ ఇవ్వాల్సింది పోయి సస్పెండ్ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం..
ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఆధారాలతో సహా బట్టబయలు అయితే ఆరు రోజుల తర్వాత సీఎం స్పందించడం సిగ్గు చేటు..
ఫేక్ ప్రచారం చేస్తున్నారని టప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడటం సిగ్గు చేటు..
ప్రమేయం ఉన్న పెద్దల తప్పించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు..
15నెలల కాలంలో నాన్ డ్యూటీ మద్యం పేమెంట్ అరికట్టమని చెబుతున్న చంద్రబాబు నకిలీ మద్యం ఎందుకు అరికట్టలేకపోయారు..
జగన్ హయాంలో టైమ్ ప్రకారం మద్యం షాపులు నడిచేవి..
నాణ్యత పరీక్షల తర్వాత, క్యూ ఆర్ కోడ్ మద్యం షాపులకు పంపిణీ చేసే పరిస్థితి ఉండేది..
నకిలీ మద్యం తయారీ చేసే డిస్టరీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి రద్దు చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా అడుగులు వేయలేదు..
48 మందిని గుర్తించి 12మంది ని అరెస్ట్ చేశామని చెబుతున్న చంద్రబాబు దీని వెనుక ఉన్న పెద్దలు ఎవరు స్పష్టం చేయాలి..
జయచంద్ర ను అరెస్ట్ చేసారా..
పెద్ద తలకాయలను వదిలి చిన్న చిన్న వాళ్ళను అరెస్ట్ చెయ్యడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి..
కల్తీ లిక్కర్ కారణంగా మృతి చెందిన ఘటనలపై విచారణ జరపాలి..
పెద్ద బాబు చిన్న బాబు సహకారంతోనే ఈ దందా సాగుతుంది..
సీబీఐ తో విచారణ జరిపే దమ్ము దైర్యం చంద్రబాబు కు ఉందా..
సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలి..
కల్తీ మద్యం తాగి లివర్ దెబ్బతిని ఆసుపత్రిపాలు అవుతున్నారు..
నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని చంద్రబాబు చెప్పారు..
ఇప్పుడు ఆయన అన్న మాటలకు అర్ధం అవుతోంది..
రాష్ట్రంలో నారా వారి బ్రాండ్ మద్యం..
నిస్సిగ్గుగా పెద్ద తలయకాయలను కాపాడటం కోసం విదేశాలకు పంపిన చంద్రబాబు..
ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం బయటపడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడ వున్నాడో..
ఆ రోజు ఎక్కడ ఉన్నావని ఉగిపోతు మాట్లాడిన పవన్ ఇప్పుడు ఎక్కడ..
ఎందుకు మాట్లాడటం లేదు..
ఆ రోజు జగన్ ను నిలదీసిన పవన్ ఇప్పుడు ఏమైపోయారు..
30వేల మహిళలు అదృశ్యం అయ్యారని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఒక్క మహిళనైనా తీసుకొచ్చారా..
అన్నను బాలకృష్ణ నానా మాటలు అంటే నోరు విప్పే పరిస్థితి లేదు..
కల్తీ మధ్యంతో ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రశ్నించే పరిస్థితి లేదు..
ఎందుకంటె ప్యాకేజీ కోసమే పవన్ మాట్లాడం లేదు..
పవన్ ప్యాకేజీ స్టార్ట్ అని ఈరోజు నిరూపణ అయ్యింది..
ఏ సమస్య ఉత్పన్నమైన నోరు మెదపడంలేదు..
పవన్ భూమిపై నడవటం లేదు గాల్లో చక్కర్లు కొడుతున్నాడు..
గతంలో జగన్ ను గాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు..
ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి పవన్..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహమ్మద్ షఫీ,బసవరాజు, కె.బాబు, చాక్లెట్ గౌస్, అజ్మతుల్లా, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, జిల్లా కార్యదర్శి మునిశేఖర్ రెడ్డి, నగర కార్యదర్శి మాస్టర్ అహ్మద్, నాయకులు కృష్ణ, వెంకటరావు, సలీం సాహెబ్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.
