పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం

..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి:ఏప్రిల్ 02
అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీ యాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గురువారం ఎన్డీఏ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించు కుంది. ఈ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, పరిపాలనా పరంగా చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి రాజధాని అంశం కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సెంటిమెంట్ అని సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ,ఈ రోజు రాష్ట్ర చరిత్రలో నిలిచిపో యే రోజు” అని పేర్కొన్నా రు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన తక్కువ కాలంలోనే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోద దశకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా ఉంచారని విమర్శిస్తూ, ఇప్పుడు అమరావతిపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయ డం దురదృష్టకరమన్నారు. అమరావతి పేరు పలకడానికే ఇష్టపడక, వేరే పేర్లతో పిలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలను కూడా ఆయన ప్రశ్నించారు.

అమరావతి అంటే ప్రజల ఆత్మగౌరవం అని పేర్కొన్న సీఎం, మా రాజధాని అమరావతి” అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. బిల్లు ఆమోదం పొందిన నేప థ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించా లని సూచించారు. ప్రతి గ్రామంలో పండుగలా కార్యక్రమాలు జరుపుతూ, కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలని కోరారు.

ఇదే సమయంలో తాను ఉద్దండరాయునిపాలెం వెళ్లి రాజధాని సంబరాల్లో పాల్గొంటానని తెలిపారు. ఆ ప్రాంతం దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీళ్లు, మట్టితో పవిత్ర స్థలంగా నిలిచిందని గుర్తు చేశారు.