యువత భవిష్యత్తుకు భరోసా కూటమి ప్రభుత్వం : కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ గుంటూరు…యువత భవిష్యత్తుకు భరోసా కూటమి ప్రభుత్వం : కనపర్తి శ్రీనివాసరావు

అవనిగడ్డ, మార్చి 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి తన విశ్వసనీయతను చాటుకున్నారని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కొనియాడారు. శుక్రవారం అవనిగడ్డలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ హామీ ఇచ్చినా దానిని తుచా తప్పకుండా అమలు చేస్తారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైకాపా ఏలుబడిలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా దిగిపోయిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువత సంక్షేమం కోసం ఒక అడుగు ముందే ఉంటున్నారని, నిరుద్యోగుల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు .చదువుకున్న యువత ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా, స్వదేశంలోనే స్థిరపడాలనే సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన వివరించారు.అమరావతి రాజధాని పనులను వేగవంతం చేస్తూ, దిగ్గజ సంస్థలను ఆహ్వానించి పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం వల్ల నిరుద్యోగులకు స్పష్టమైన భరోసా లభిస్తోందని రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరియు మంత్రి నారా లోకేష్‌లకు ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యువత అంతా కూటమి ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని వారు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలోదివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి బసవేశ్వర రావు,నాగాయలంక చలపల్లి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు, మోర్ల రాంబాబు పార్టీ నాయకులు మండలి రామమోహన రావు,ఘంటసాల రాజమోహనరావు , గుత్తికొండ వంశీ, ఉప్పల ప్రసాద్, తాడేపల్లి పాపారావు మరియు ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.