వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతినెలా 5న ర్యాలీలు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు

భారత్ న్యూస్ రాజమండ్రి….వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రతినెలా 5న ర్యాలీలు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు

సచివాల యాల ఉద్యోగులు క్రియాశీలకంగా ర్యాలీల్లో పాల్గొనడంతో పాటు వాట్సాప్ గవర్నెన్స్క సంబంధించి ఎక్కువ మంది ‘మనమిత్ర’ యాప్ ను వినియోగించేలా ప్రజలను చైత న్యపరచాలని సూచించారు.

ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతినెలా 5వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీల నిర్వహణకు గ్రామ, వార్డు సచివా లయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ కార్యక్రమ నిర్వహణకు తగిన చర్యలు చేపట్టాలంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.