ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అకౌంట్ వాడాలంటే కేవైసీ తప్పనిసరి

భారత్ న్యూస్ అనంతపురం.ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అకౌంట్ వాడాలంటే కేవైసీ తప్పనిసరి

ఇన్‌స్టాగ్రామ్ సహా సోషల్ మీడియా అకౌంట్లు వాడే వారికి ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. ఇకపై అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

ఇదే జరిగితే, ఫేక్ అకౌంట్లు అన్నీ తొలగిపోతాయి. దీంతో ఆన్‌లైన్‌లో మోసాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ మేరకు కేంద్రం త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేయనుంది. ఆన్‌లైన్‌, సోషల్ మీడియా మోసాలు అరికట్టేందుకు, సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర హోం వ్యవహారాలు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది.