దగదర్తి’ విమానాశ్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – రూ. 916కోట్లతో టెండర్లు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…దగదర్తి’ విమానాశ్రయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – రూ. 916కోట్లతో టెండర్లు

916కోట్లతో దగదర్తి విమానాశ్రయ మొదటి దశ పనులకు టెండర్లు – పీపీపీ విధానంలో చేపట్టాలనున్న రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుంచి అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్​ను తిరిగి తెచ్చేందుకు రాజధాని అమరావతితో పాటు రోడ్లు, రైలు, వాయు మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం మొదటి దశ పనులను రూ.916 కోట్లతో ప్రభుత్వం చేపట్టనుంది. పీపీపీ విధానంలో దీనిని చేపట్టాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విమాన సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దగదర్తి దగ్గర గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. జిల్లాలో పారిశ్రామికంగా, పర్యాటకంగా జరిగే కార్యకలాపాలతో విమానాశ్రయం నుంచి ప్రయాణీకులు, సరకు రవాణా బాగా పెరుగుతుందని ఏపీఏడీసీఎల్‌ అంచనా వేసింది. దీనివల్ల కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలు, పరిశ్రమలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది.

టెండరు ప్రక్రియ ప్రారంభం : దగదర్తి విమానాశ్రయ నిర్మాణానికి ఏపీఏడీసీఎల్‌ అంతర్జాతీయ టెండరును పిలిచింది. వచ్చే నెల 10న ప్రీబిడ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. బిడ్‌ల దాఖలకు నవంబరు 3వ తేది తుదిగడువు.

రాష్ట్రంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరో 7 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్‌పోర్టులను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఎయిర్‌పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రాయాల కట్టడంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.