భారత్ న్యూస్ రాజమండ్రి..భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ
సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపు
భారత వైమానిక దళం (IAF) 2026 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న “అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ” ని పల్నాడు జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ శ్రీమతి కృతికా శుక్లా, IAS గారు ఒక ప్రకటనలో కోరారు.
ఈ ర్యాలీకి సంబంధించిన ముఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ర్యాలీ వేదిక మరియు సమయం
వేదిక: ముఖ్య ద్వారం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, NH-16, నాగార్జున నగర్, గుంటూరు జిల్లా.
తేదీలు: మార్చి 09, 2026: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మహిళా అభ్యర్థులకు.
మార్చి 12, 2026: ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు.
రిపోర్టింగ్ సమయం: ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు.
అర్హతలు
వయస్సు: 02 జూలై 2005 నుండి 02 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి.
వైవాహిక స్థితి: అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హత: ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన కోర్సులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50% మార్కులు ఉండాలి.
ఎత్తు: కనీసం 152 సెం.మీ. ఉండాలి.
ముఖ్య గమనిక
ఈ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ర్యాలీ వేదికకు హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ వెంట ఒరిజినల్ విద్యార్హత పత్రాలు, డొమిసిల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 10 పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు సర్టిఫికేట్ల యొక్క 6 సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి.
దేశ సేవ చేయాలనే తపన ఉన్న పల్నాడు జిల్లా యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత వైమానిక దళంలో చేరాలని కలెక్టర్ గారు ఆకాంక్షించారు. మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

డా . కృతిక శుక్లా, IAS
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ,
పల్నాడు జిల్లా.