అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ న్యూస్ విశాఖపట్నం..అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతం

మధ్య శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-3ని భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందిపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష అన్ని కార్యాచరణ, సాంకేతిక, పారామితులను ధ్రువీకరించిందని ఒక అధికారి తెలిపారు.

దీనిని వ్యూహాత్మక దళాల కమాండ్‌ ఆధ్వర్యంలో చేపట్టినట్టు ఆయన చెప్పారు.