వైఎస్ జగన్ గారి పై మాట్లాడే అర్హత మండలి బుద్ధ ప్రసాద్ కు లేదు

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైఎస్ జగన్ గారి పై మాట్లాడే అర్హత మండలి బుద్ధ ప్రసాద్ కు లేదు

     - వైసీపీ యువనేత గౌతమ్

బుద్ధ ప్రసాద్ గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తానంటారు… కానీ చేస్తున్నది మాఫియాలకు సహకారమని, నాలుగు పార్టీలు మారిన మండలి ఏ విలువలకు నిలబడతారని, గాంధీ సిద్ధాంతాలపై నమ్మకముంటే, ఇప్పటివరకు నాలుగు పార్టీలను ఎందుకు మార్చారని, గాంధేయ సిద్ధాంతాలను అనుసరిస్తే మరి ప్రస్తుత అన్ని సర్వే రిపోర్టులలో రెడ్ లిస్ట్ లోకి ఎందుకు వెళ్ళాల్సివచ్చిందని గౌతమ్ ప్రశ్నించారు..,

బుద్ధ ప్రసాద్ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల విశ్వాసాన్ని పణంగా పెట్టిన వ్యక్తని, ఇప్పుడు ప్రజల నాయకుడు జగన్ గారిపై మాట్లాడటానికి బుద్ధ ప్రసాద్ కు నైతిక హక్కే లేదని, బుద్ధ ప్రసాద్ నాయకత్వంలో అవనిగడ్డలో బియ్యం మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా పెరిగిపోయాయని, ఇది గాంధీయవాదమో లేక వ్యూహపూరిత రాజకీయమో ప్రజలు గమనిస్తున్నారని గౌతమ్ అన్నారు…,

సింగయ్య గారి మరణించిన విషయంలో మీరు చేస్తున్న ప్రచారం అసత్యమని, జిల్లా ఎస్పీ గారు స్వయంగా “సింగయ్య గారి మరణానికి కారణం ప్రైవేట్ వాహనం” అన్న స్పష్టత ఇచ్చారని, కానీ ఇప్పుడు మరలా జెడ్+ సెక్యూరిటీ కలిగిన జగన్ గారి వాహనం వల్లే అని తప్పుడు ప్రచారం చేయిస్తూ, మరియు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం ఓ మరణాన్ని ఆసరాగా వాడుతున్నారని, మరి రాజమండ్రి పుష్కర ఘాట్ తొక్కిసలాటలో జరిగిన మరణాల బాధ్యత ఎవరిదని, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా బాధ్యత ఎందుకు వహించలేదని గౌతమ్ ప్రశ్నించారు ?

శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడమే మీ కూటమికి లక్ష్యంగా మారిపోయిందని, అవనిగడ్డ నియోజకవర్గంలో 5 వేల ఎకరాల పంట భూములకు సాగునీటి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, వేసవిలో అవుట్‌ఫాల్ స్లూయిస్ సిద్ధం అవుతాయని హామీ ఇచ్చారని, కానీ అక్కడ ఒక్క పనీ సరిగ్గా జరగలేదని, ఇది మండలి పాలనా వైఫల్యానికి నిదర్శనమని గౌతమ్ విమర్శించారు…,

బుద్ద ప్రసాద్ అభివృద్ధిపై ఏ పనీ చేయకుండానే, జగన్ గారి పట్ల విమర్శలు చేయడం ఆయన అసలైన మానసిక స్థితిని తెలియజేస్తోందని, నియోజకవర్గ ప్రజలు చక్కగా అన్ని గమనిస్తున్నారని, ప్రతి సర్వేలో మీరు రెడ్ లిస్ట్‌లో ఉన్నారని మర్చిపోవద్దని దానికి కారణం – అవగాహనా రాహిత్యం, నాయకత్వంలో మాఫియాలకు అండ కల్పించడం, ప్రజా సమస్యల పట్ల నిర్వీర్యతే ముఖ్య కారణాలని గౌతమ్ తెలిపారు…,

జగన్ గారిని విమర్శలు చేసే ముందు మండలి ఆయన పాలనను ఒకసారి చూసుకుంటే మంచిదని, ముందు నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి పెట్టాలని గౌతమ్ సూచించారు.