ఏపీలో బెంబేలెత్తిస్తున్న ఆదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు.

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో బెంబేలెత్తిస్తున్న ఆదాని స్మార్ట్ విద్యుత్ మీటర్లు.

స్మార్ట్ మీటర్లతో వాణిజ్య వినియోగదారులకు లక్షల్లో బిల్లులు.

కరెంట్ బిల్లులు చూసి లబోదిబోమంటున్న వ్యాపారులు.

స్మార్ట్ మీటర్లపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశాలు..

క్షేత్ర స్థాయి విచారణకు ఆదేశం: పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమర్చిన స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న ఆరోపణలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పందించారు.

సమగ్ర దర్యాప్తు: స్మార్ట్ మీటర్ల పనితీరు, అధిక ఛార్జీల ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

నివేదిక సమర్పణ: సోమవారం నాటికి పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులకు ఆదేశం.

అధిక భారం ఉండదు: “ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదు” అని మంత్రి స్పష్టం చేశారు.

పనితీరుపై నిశిత పరిశీలన: స్మార్ట్ మీటర్ల పనితీరుపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు…..