భారత్ న్యూస్ గుంటూరు….ఆరోగ్యశ్రీ లిమిట్ ను రూ. 25 లక్షలకు పెంచాం. 104, 108 సేవలను మరింత పటిష్టం చేశాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చి డాక్టర్ ను ఇంటింటికీ పంపాం. వైద్యరంగంలో జీరో వేకెన్సీ పాలసీ ద్వారా ఖాళీలను ఎప్పటికప్పుడూ భర్తీ చేశాం. నెట్వర్క్ హాస్పటల్స్ పెంచి ప్రజలకు వైద్యసేవలు దగ్గర చేశాం. విలేజ్ క్లినిక్స్ మొదలు టీచింగ్ హాస్పటల్స్ వరకూ కనెక్టివిటీని ఏర్పాటు చేశాం. ప్రజారోగ్యం కోసం జగనన్న ప్రభుత్వంలో ఇంత చేస్తే కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల విశ్వసనీయత లేదు అంటున్నారు. ఇదీ నేటి ప్రభుత్వ తీరు.

-విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్