భారత్ న్యూస్ రాజమండ్రి..ఈ నెల మొదటి వారంలో పిడుగుపాటుకు గురై మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్రేషియా విడుదల చేసింది.
ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున రూ.36 లక్షలు విడుద లకు పరిపాలనా ఆమోదం తెలుపుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుపతి జిల్లాలో నలుగురు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు జిల్లాలో ఒకరు పిడుగుపాటుకు మృతిచెందారు.