రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్రానికి పీఎం-ఈబస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ కేటాయించిందని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఒక ప్రకటనలో తెలిపింది.

అందులో 150 బస్సులను విశాఖ నగరంలో వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆపరేటర్లను గుర్తించేందుకు వీలుగా ఆర్టీసీకి లెటర్ ఆఫ్ అవార్డు జారీచేసినట్లు పేర్కొంది.