ఈ పక్షిని(కలివిడి కోడి) గుర్తించడానికి రూ.50 కోట్ల ఖర్చు

భారత్ న్యూస్ సత్యసాయి జిల్లా….ఈ పక్షిని(కలివిడి కోడి) గుర్తించడానికి రూ.50 కోట్ల ఖర్చు

అంతరించిపోతున్న అత్యంత అరుదైన పక్షుల్లో కలివికోడి ఒకటి.

వైఎస్సార్ కడప జిల్లా కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి ఉనికిని గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వరకు వెచ్చించాయి.

27 సెంటీమీటర్ల పొడవుండే ఈ పక్షిని ఇటీవల ఈ అభయారణ్యంలో పక్షి పరిశోధక బృందం సభ్యులు గుర్తించారు.

ఈ పక్షి కూస్తే దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది.

పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ వీటి లక్షణం