భారత్ న్యూస్ రాజమండ్రి…సదరం పరిధిలోకి మరో 5 వైకల్యాలు: మంత్రి సత్యకుమార్
అమరావతి :
ఏపీ ప్రభుత్వం మరో ఐదు రకాల వైకల్యాలను సదరం (SADAREM) పరిధిలోకి చేర్చినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. యాసిడ్ దాడి బాధితులు, ఆటిజం, లెర్నింగ్ డిజార్డర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, బహుళ వైకల్యాల వారికి ఇకపై డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఈ నెల 25 నుంచి స్లాట్ బుకింగ్, 30 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సత్య కుమార్ సూచించారు.
