భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో 4 గ్రేడ్లుగా పంచాయతీల విభజన

Ammiraju Udaya Shankar.sharma News Editor…కొత్త విధానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి
గ్రామాల్లో పట్టణ స్థాయి సదుపాయాలు
సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి:
రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నట్లు ఉప ముఖ్య మంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కొత్త విధానంతో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి ప్రతి స్థాయిలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రస్తుత క్లస్టర్ విధానంలో రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి పంచాయతీకి గ్రేడ్ల వారీగా కార్యదర్శులుండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో పంచాయ తీల్లో అమలు చేస్తున్న విధానాలు, అందులో లోపాలు, చేయాల్సిన మార్పులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాధారణ పరిపాలన, ఆర్థిక, న్యాయ శాఖల ఉన్నతాధికారులు శుక్రవారం ప్రజంటేషన్ ఇచ్చిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘ప్రస్తుత లోపభూయిష్టమైన పరిపాలన వ్యవస్థలు పంచాయతీల ప్రగతికి అవరోధాలుగా మారాయి. 48 ఏళ్ల క్రితం ఉన్న సిబ్బంది నమూనాయే ఇప్పటికీ అమల్లో ఉంది. గతంలో అమలు చేసిన క్లస్టర్ విధానంలోనూ ఇబ్బందులున్నాయి. పంచాయతీల గ్రేడ్ల నిర్ణయానికి గతంలో ఆదాయాన్ని ప్రాతిపదికగా చేసుకున్నారు. ప్రస్తుతం జనాభా, మండల కేంద్రం, గిరిజన, గిరిజనేత ప్రాంతం, ఆదాయం అనే అంశాలను విశ్లేషించుకుని నాలుగు గ్రేడ్లుగా విభజించనున్నాం. పంచాయతీల్లో పట్టణ స్థాయి సౌక మార్పులు చేస్తున్నాం. పంచాయతీ కార్యా లయాల్లోనూ పౌర సేవలు సత్వరం అందేలా పునర్వ్యవస్థీకరిస్తున్నాం. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సౌక ర్యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది’ అని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, పంచాయతీరాజ్ శాఖ
