..భారత్ న్యూస్ అమరావతి..26జిల్లాల్లో యాక్షన్ ప్లాన్ తో విజన్-2047 డాక్యుమెంట్ తయారైంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసి దీనికోసం పనిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కృషి చేయాలి. ప్రజాసమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. 175 నియోజకవర్గాల్లో స్వర్ణ నియోజకవర్గాలను గుర్తించే పనిలో ఉన్నాం. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం.
