భారత్ న్యూస్ విశాఖపట్నం..ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి
Jun 28, 2025,

ద్విచక్ర వాహనంతో 2 హెల్మెట్లు తప్పనిసరి
కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి రెండు ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన మూడోనెల నుంచి, ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, వాహన కొనుగోలుదారుకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని త్రిచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం అమర్చాలనీ ప్రతిపాదించింది. ఈ సవరణలపై అభ్యంతరాలు, సూచనలు సలహాలు ఇవ్వాలని తెలిపింది