ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే రూ.196 కోట్ల బంగారం

భారత్ న్యూస్ విజయవాడ…ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే రూ.196 కోట్ల బంగారం

మాన్షన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబయికి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే కేసు 20 శాతం చొప్పున మద్యం మాఫియా రూ.280 కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు రూ.196 కోట్లు… బంగారం రూపంలోనే చెల్లించినట్లు గుర్తించింది. తిల క్నగర్ ఇండస్ట్రీస్ సంస్థ.. పద్మావతి. జ్యూయలరీ షాప్ సుమారు రూ.107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్తో రూ.85 కోట్లు, సోనాచాందీ జ్యూయలర్స్తో రూ.3. 5 కోట్లు, ఉదయ్ జ్యూయలరీ ఇండస్ట్రీస్లో రూ.80 లక్షలకు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. మిగతా డిస్ట్రి లరీలు, మద్యం కం పెనీల నుంచి ఇంకెంత బంగారం రూపంలో అందిందో దర్యాప్తులో తేలుతుంది.