భారత్ న్యూస్ శ్రీకాకుళం….పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు
రాష్ట్రంలోని మిలియన్ ప్లస్ నగరాలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థికసంఘం తొలి విడతగా అదనపు నిధుల కోసం రూ.176 కోట్ల 84 లక్షల 72 వేలు బడ్జెట్ విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2025-26 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా ట్రెజరీ నియంత్రణ తగిన సమయంలో అనుబంధ గ్రాంట్లను పొందడం ద్వారా నిధుల కేటాయింపు ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది.
నిధుల విడుదలతో ఇక పట్టణాల్లో పనులకు లైన్ క్లియర్ అయింది.

ఇదిలా ఉండగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి పట్టణ స్థానిక సంస్థలకు 15722.49 లక్షల గ్రాంట్ మొదటి విడత (రూ.6289.00 లక్షల అన్లైడ్ బేసిక్ గ్రాంట్ రూ.9433.49128 లక్షల టైడ్ గ్రాంట్) నిబంధనలకు అనుగుణంగా రూ.157 కోట్ల 22 లక్షల 49 వేలు విడుదల చేస్తూ బుధవారం పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.