కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు 141 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

.

భారత్ న్యూస్ గుంటూరు….వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు 141 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశ దిక్సూచి కాంగ్రెస్ పార్టీ.

బ్రిటిష్ బానిస సంకెళ్ళను విముక్తి చేసి, దేశానికి స్వాతంత్ర్యం సాధించి,

నవ భారత నిర్మాణానికి పునాదులు వేసి, దేశాన్ని అభివృద్ధిలో అగ్రపథంలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ.

త్యాగం నుంచి స్వప్నం వరకు, ఉద్యమం నుంచి పాలన వరకు దేశమంటేనే కాంగ్రెస్.

నాడు కాంగ్రెస్ సారధ్యంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే నేటి అభివృద్ధి ఫలాలు.

త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నిలబెడితే,

ఇవ్వాళ భారత చరిత్రను కాషాయ పార్టీ చెద పురుగులు తొలుస్తున్నాయి.

దేశ సహజ సంపదను తింటున్నాయి.

రాజ్యాంగాన్ని మార్చి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను వక్రీకరిస్తున్నాయి.

వ్యవస్థలను బానిసలుగా చేసి నియంత పాలన చేస్తున్నాయి.

సర్వమత సమ్మేళనంగా విరాజిల్లే భారతావనిని మతం ముసుగులో RSS వ్యవస్థ కలుషితం చేస్తుంది.

అభినవ భారతంలో ఈ దేశానికి మరో స్వాతంత్ర్యం రావాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోనే మరో విముక్తి పోరాటం చేయాల్సి ఉంది.

దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే మత పిచ్చి గాళ్లను బంగాళాఖాతంలో కలపాల్సి ఉంది.

ఆనాటి కాంగ్రెస్ శ్రేణుల త్యాగం,ధైర్యం ఆయుధాలుగా చేసుకొని ..