అమరావతిలో 10వేల మంది కార్మికులతో పనులు

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతిలో 10వేల మంది కార్మికులతో పనులు !

అమరావతి నిర్మాణం ఊపందుకుంది. అక్కడ మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం పది వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన పనులను .. మళ్లీ టెండర్లు వేసి పనులు ప్రారంభించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కాంట్రాక్టర్ సంస్థలు పనులు శరవేగంగా చేస్తున్నాయి.

ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా తమకు కేటాయించిన స్థలాల్లో పనులు ప్రారంభిస్తున్నాయి. స్థలాలు పొందిన ప్రతి ఒక్కరికీ .. నిర్మాణాలు ప్రారంభించడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ లోపు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించకపోతే స్థలాలు రద్దు చేస్తామని ప్రకటించారు. గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ బత్తి కంపెనీలు.. ఆసక్తి చూపకపోవడంతో వాటికి స్థలాలను రద్దు చేశారు. చాలా కంపెనీలు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చాయి. ప్రారంభించకపోతే ఆ కేటాయింపులను రద్దు చేయనున్నారు.

రెండు, మూడేళ్లలో విజుబుల్ డెవలప్‌మెంట్ ను అమరావతిలో ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో అమరావతి విస్తరణ ప్రణాళికల్ని కూడా అమలు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుతో పాటు వివిధ సంస్థలకు అవసరమైన భూమిని.. భూమీకరణలో సేకరించేందుకు నిర్ణయించారు. చాలా మందిరైతులు తమ ఆమోదం తెలిచేస్తున్నారు. ప్రస్ుతత పనులు జోరుగా సాగితే.. వారికి మరింత నమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది.