భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…కరకట్ట పై పోలీసుల శ్రమదానం
చల్లపల్లి : ఈదురు గాలులకు నడకుదురు కరకట్టపై విరిగిపడిన చెట్లను పోలీసు అధికారులు తొలగించారు. చల్లపల్లి మండల పరిధిలోని రాముడుపాలెం, నాదెళ్లవారిపాలెం, మోపిదేవి మండల
పరిధిలోని కొత్తపాలెం తదితర ప్రాంతాల్లో కరకట్టపై చెట్లు విరిగిపడ్డాయి. ఆత్యవసరంగా కొన్నిచెట్లను యంత్రంతో కోసి రాకపోకలకు ఇబ్బందిలేకుండా చేసినప్పటికీ, మరికొన్ని చెట్లు అలాగే పడిఉన్నాయి. కరకట్టపై రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో విరిగిన చెట్లను తొలగించేందుకు పోలీసులే రంగంలోకి దిగారు. గురువారం సాయంత్రం చల్లపల్లి సీఐ కె.ఈశ్వరరావు ఆధ్వర్యంలో మోపిదేవి ఎస్ఐ సత్యనారాయణ, పోలీసు సిబ్బంది శ్రమదానం చేశారు. విరిగిపడి రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు.
