…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో కొత్తగా టూరిస్ట్ పోలీసులు
TG: పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు DGP జితేందర్ తెలిపారు.
తొలి దశలో 80 మంది పోలీసులు పనిచేయనున్నారని చెప్పారు. అనంతగిరి, రామప్ప, సోమశిల, నాగార్జునసాగర్, బుద్ధవనం తదితర పర్యాటక ప్రాంతాల్లో స్వదేశీ, విదేశీ టూరిస్టులకు వీరు రక్షణ కల్పిస్తారని పేర్కొన్నారు.

వచ్చే నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ సిస్టమ్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.