ప్రమాదంలో సింగూరు డ్యాం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ప్రమాదంలో సింగూరు డ్యాం

వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈఎన్‌సీకి లేఖ రాసిన ఎన్‌డీఎస్ఏ

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు డ్యాం ప్రమాదంలో ఉందని, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసిన ఎన్‌డీఎస్ఏ

రిజర్వాయర్ నీటి నిల్వ ప్రాంతంలో పలుచోట్ల మట్టికట్ట, రివిట్మెంట్ దెబ్బతిన్నాయని, పారపెట్ గోడ, మట్టికట్ట పైభాగంలో పగుళ్లు ఉన్నాయని తెలిపిన ఎన్‌డీఎస్ఏ

సింగూరుకు దిగువన నిజాంసాగర్, మంజీరా డ్యాములు ఉన్నాయని, కాబట్టి ఈ డ్యాం పరిరక్షణ అత్యంత కీలకమైన అంశంగా పరిగణించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఈఎన్‌సీకి సూచించిన ఎన్‌డీఎస్ఏ సదరన్ రీజియన్ డైరెక్టర్.