భారత్ న్యూస్ మంగళగిరి ….లింగారెడ్డి పాలెం పిఎసిఎస్ త్రీ మెన్ కమిటీ పదవీ బాధ్యతలు స్వీకరణ
చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన కోట సుబ్బారావు
కోడూరు మండల పరిధిలోని లింగారెడ్డి పాలెం గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రీమెన్ కమిటీ చైర్మన్ గా కోట సుబ్బారావు, సభ్యులుగా నల్లూరి చిన్నభూశంకరరావు, ఉప్పల కోటేశ్వరరావు మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన చైర్మన్ కోట సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరికు కృతజ్ఞతలు తెలియజేసి, తనపై నమ్మకంతో తనకు కేటాయించిన పదవికి వన్నెతెచ్చేలా కృషి చేస్తానని రైతులందరికీ అందుబాటులో ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ యర్రం శెట్టి శ్రీ దుర్గా, సీఈఓ చిట్టిప్రొలు సుబ్బారావు, సిబ్బంది కడవకొల్లు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
