..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్లు తెలిపిన ఎన్టీపీసీ బృందం
సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు వివరించిన ఎన్టీపీసీ సీఎండీ
ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని తెలిపిన ఎన్టీపీసీ బృందం

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి