భారత్ న్యూస్ మంగళగిరి ….పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తున్న కనపర్తిపై ఆరోపణలు తగదు
అవనిగడ్డ, ఆగస్టు 8
అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ శ్రేయస్సు కోసం కార్యకర్తలకు నిరంతరం అండగా ఉండి పని చేస్తున్న కనపర్తి శ్రీనివాసరావుపై కొందరు వ్యక్తిగత స్వార్ధంతో ఆరోపణలు చేయటం తగదని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. శుక్రవారం అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ సొసైటీ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంంభన విషయమై పార్టీకి సంబంధం లేని వారు అనవసరపు రాదాంతం సృష్టించేందుకు ప్రయత్నిస్తూ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావుపై అనవసరపు ఆరోపణలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నియోజకవర్గంలో చుక్కాని లేని నావలా ఉన్న తెలుగుదేశం పార్టీని కనపర్తి శ్రీనివాసరావు ముందుడి నడిపిస్తున్నారని, కార్యకర్తకు ఏ కష్టమొచ్చిన వారికి అండగా ఉంటూ తన పలుకుబడిని ఉపయోగించి పని చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సొసైటీల అధ్యక్షుల ఎంపిక విషయంలో గ్రామ పార్టీలు, మండల పార్టీలకు అనుగుణంగానే అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపించారని, పార్టీ సీనియారిటీనే ప్రాతిపదికగా తాము పేర్లను ప్రతిపాదిస్తే ఒకటికి నాలుగు సార్లు పరిశీలన జరిపి చైర్మన్ల పేర్ల జాబితాను అధిష్టానానికి పంపించారని తెలిపారు. అవనిగడ్డ పిఏసిఎస్ కు రత్నారావు పేరును, పార్టీలో సీనియర్లలో ఒకరైన రత్నారావు పేరును తాము సూచిస్తే ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆ పేరునే ఆయన ఖరారు అయ్యేలా చూశారని, అలాంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయటం తగదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పరుచూరి దుర్గా ప్రసాద్, కర్రా సుధాకర్, ఘంటసాల రాజమోహనరావు, బండే రాఘవ, అడపా శ్రీను, షేక్ బాబావలి, మేడికొండ విజయ్ పాల్గొన్నారు.
