ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

భారత్ న్యూస్ మంగళగిరి ….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ :

కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పనుంది.

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడం, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉచితంగా ఎగ్ కార్ట్‌లను అందించనుంది.

తొలి విడతలో భాగంగా రూ.50 వేల విలువ గల ఎగ్ కార్డులను ఉచితంగా ఇవ్వనుంది.

అయితే ప్రభుత్వం అందజేసే ఎగ్ కార్ట్ విలువ రూ.35వేలు కాగా..

దానితోపాటు రకరకాల వంటలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేయనుంది.

దీని ద్వారా మహిళలు ప్రతి నెలా రూ.20 వేలు సంపాదించవచ్చని అధికారులు చెబుతున్నారు.