సృష్టి ఫెర్టిలిటీ కేసు.. 9 మంది ఏజెంట్ల అరెస్ట్

..భారత్ న్యూస్ హైదరాబాద్….సృష్టి ఫెర్టిలిటీ కేసు.. 9 మంది ఏజెంట్ల అరెస్ట్

TG: సృష్టి ఫెర్టిలిటీ స్కాంలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టులు 26కి చేరాయి. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, మహిళా ఏజెంట్లు అధికంగా ఉన్నారు. డాక్టర్ నమ్రతకు చెందిన బ్యాంక్ ఖాతాలు, హాస్పిటల్ అకౌంట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.