భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..Ammiraju Udaya Shankar.sharma News Editor…శ్రీకాకుళం జిల్లా పోలీసు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని,శ్రీకూర్మంలో ఉన్న శ్రీకూర్మనాధ స్వామి వారిని దర్శించుకున్ను రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత గారు.
హోంమంత్రి వంగలపూడి అనిత వారిని మర్యాద పూర్వకంగా కలిసి,స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి.
శ్రీకాకుళం,ఆగస్టు 03. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత గారు అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని, శ్రీకూర్మంలో ఉన్న శ్రీకూర్మనాధ స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత గారుని ముందుగా అరసవిల్లి ఆలయం ఆవరణంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముందుగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని, శ్రీకూర్మంలో ఉన్న శ్రీకూర్మనాధ స్వామి వారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి కెవి రమణ,డీఎస్సీలు ప్రసాద్ రావు, శేషాద్రి, సీఐలు ఇమ్మానియేల్
