భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…కృష్ణాజిల్లా గుడివాడ
డ్రైనేజీ శాఖ కార్యాలయంపై ఏసిబి అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు తీశారు.ఈ.ఈ కార్యాలయంలో 30వేలు లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు నేతృత్వంలో దాడులు జరిగాయి.డ్రైనేజీ బిల్లు విషయంలో కాంట్రాక్టర్ తురకా రాజా నుండి జూనియర్ అసిస్టెంట్ 30వేలు డిమాండ్ చేసినట్లు డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. లంచం తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావును పట్టుకున్నామని,కెమికల్ టెస్ట్ లో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డిఎస్పి తెలియచేశారు.ఓ డ్రైనేజీ వర్కులో కాంట్రాక్టర్ డిపాజిట్ నిధులు విడుదల చేయడంలో జూనియర్ అసిస్టెంట్ ఇబ్బందులకు గురి చేసినట్లు డిఎస్పి సుబ్బారావు చెప్పారు
