ఏపీలో ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

భారత్ న్యూస్ విజయవాడ……Ammiraju Udaya Shankar.sharma News Editor……..…ఏపీలో ఈ నెల 12, 13 తేదీల్లో ఆర్టీసీ కార్మికుల ధర్నా

ఆంధ్ర ప్రదేశ్ :

ఏపీలోని ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సెటిల్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విజయవాడలో పీవీ రమణారెడ్డి అధ్యక్షతన నేషనల్ మజ్దాూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది.

సంస్థలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీ స్థలాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తీర్మానించారు.

ఈ నెల 12, 13 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలో ధర్నా చేయాలని పిలుపునిచ్చారు.