తూర్పు మయామి’గా విశాఖ!

భారత్ న్యూస్ విశాఖపట్నం..తూర్పు మయామి’గా విశాఖ!

విశాఖను ‘తూర్పు మయామి’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. జి-హబ్ ప్రణాళికలో భాగంగా విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో 1,941 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కు మంజూరు చేసింది. మెట్రో, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.4,000-5,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీనితో విశాఖ నగర రూపురేఖలు మార్చి, గ్లోబల్ సిటీగా ఎదిగే దిశగా ముందడుగు వేస్తోంది.