భారత్ న్యూస్ ఢిల్లీ…..స్వదేశీ ఉత్పత్తులపై మోదీ దృష్టి!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 25% టారిఫ్ విధించిన తర్వాత, ప్రధాని మోదీ ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య ‘స్వదేశీ’ ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
వారణాసిలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ, భారతీయులు స్థానిక ఉత్పత్తులు కొనాలని, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడాలని కోరారు. ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రంతో భారతీయ శ్రమ, నైపుణ్యాన్ని గౌరవించాలని అన్నారు
