..భారత్ న్యూస్ హైదరాబాద్….Breaking : రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు చెక్.
- ఆసక్తి లేనివారు నాట్ విల్లింగ్ పత్రాలు ఇవ్వాలని కోరుతున్న అధికారులు
- ఆసిఫాబాద్ జిల్లాలో నాట్ విల్లింగ్ ఇచ్చిన వారు 109 మంది
- అంతంత మాత్రంగానే ప్రారంభాలు .. విచ్చలవిడిగా పెరుగుతున్న రేట్లు
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల బ్యూరో శ్రీకాంత్ ; కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారిలో చాలా మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇప్పటికీ కనీసం ముగ్గు కూడా పోయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ఇంటిని రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై ఆసక్తి లేని పక్షంలో వారి నుంచి పత్రాలు తీసుకోవాలని ఉన్నతాధికారులు మండలాధికారులకు సూచిస్తున్నారు. పలువురు ముందుకు వచ్చి నాట్ విల్లింగ్ (మాకు ఆసక్తి లేదు) అని రాసిస్తున్నారు. మరి కొందరు ఇవ్వడం లేదు. అలా అని పనులూ ప్రారంభించడం లేదు. దీంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో మొత్తం 9421 ఇళ్లకు తొలి విడతలో మంజూరు చేశారు. రెండో విడతలో 1962, మూడో విడదలో 7459 ఇళ్లు మంజూరు చేశారు. ఇంకా 3,403 వాటికి మంజూరు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వీటిలో 362 గోడల వరకు, 102 నిర్మాణాలకు సంబంధించి పైకప్పు పూర్తయ్యాయి. 3 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. స్వశక్తి సంఘాల్లో ఉన్న లబ్ధిదారులకు రూ.లక్ష రుణం ఇప్పించేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ముత్తారం మండలం మచ్చుపేటలో 5, పాలకుర్తి మండలం రామారావుపల్లిలో 15 ఇళ్లకు సంబంధించి రుణం ఇవ్వడంతో పనులు ప్రారంభించారు. అవసరమైన లబ్ధిదారులకు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు కరీంనగర్లో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారు. ట్రాక్టరు కంకర 15 రోజుల కిందట రూ.2400 – రూ.2,700 ధరకు మార్కెట్లో లభించింది. కానీ ఇప్పుడు ధర అనుహ్యంగా రూ.3,500కు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లకు కీలకమైన సిమెంట్, కంకర తక్కువ ధరకు అందించాలని అధికారులకు సూచనలు ఇచ్చిన వ్యాపారులు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇంటి నిర్మాణానికి ముందుగు రావడం లేదు. ప్రస్తుత ఉన్న రేట్లతో ఇళ్లు నిర్మాణం చేపట్టాలి అంటే అప్పులు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. అప్పులు చేసి ఇళ్లు కట్టి, మళ్లీ వాటిని తీర్చలాంటే ఇబ్బందులు మొదలవుతాయని అంటున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
