ప్రయాణికులకు అసౌకర్యం కలగనివ్వం

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ప్రయాణికులకు అసౌకర్యం కలగనివ్వం *

*ఆర్టీసీ డి ఎం కే. హనుమంతరావు *
ప్రయాణికులకు అసౌకర్యం కలగనివ్వమని అవనిగడ్డ ఆర్టీసీ డిపో మేనేజర్ కే హనుమంతరావు తెలిపారు. శుక్రవారం ఆయన చల్లపల్లి బస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 15 వ తారీకు నుండి ప్రయాణికుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో బస్ స్టాండ్ లలో వారికి అందించాల్సిన సౌకర్యాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిపో పరిధిలోని అన్ని బస్ స్టేషన్లను పరిశీలించి బస్ స్టేషన్ ఆవరణలో విద్యుత్ సౌకర్యం, మంచినీటి వసతి, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, ఫ్యాన్లను, టాయిలెట్స్ వాటి పనితీరు మెరుగుపరిచేందుకు సిబ్బందికి తగు సూచనలు చేసినట్లు వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాట్లు వివరించారు. డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికుల పట్ల గౌరవ మర్యాదలతో మెలగాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కూచిపూడి, మొవ్వ,చల్లపల్లి బస్ స్టేషన్లను సందర్శించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు సిబ్బందికి సూచించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలక్ష్మి, సూపర్ండెండెంట్ పి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.