..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ : సర్పంచ్ ఎన్నికలు.. ఆ 18 గ్రామాల్లో లేనట్లే!
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు, జిన్నారం మండలాల్లోని 18 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.
ఇందుకు 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
దీంతో ఈ 18 గ్రామాల పంచాయతీలను స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించనున్నారు.
ఈ గ్రామాల ఓటర్లను మున్సిపాలిటీలో కలుపనున్నారు. దీంతో ఈ గ్రామాల్లో స్థానిక ఎన్నికలు లేనట్లే అని చెబుతున్నారు.
