భారత్ న్యూస్ విజయవాడ…తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమలు
వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి తగ్గింది.
ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు..

తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి.
తగ్గిన ధరలు నేటి (శుక్రవారం) నుంచే అమల్లోకి రానున్నాయి.
అయితే గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి.