పాత ఎడ్లంకలో వరద పరిస్థితిని పరిశీలించిన తెలుగుదేశం నేతలు ..

భారత్ న్యూస్ విజయవాడ…పాత ఎడ్లంకలో వరద పరిస్థితిని పరిశీలించిన తెలుగుదేశం నేతలు ..

కృష్ణానది వరదల కారణంగా కోతకు గురవుతున్న పాత ఎడ్లంక దీవిని గురువారం సాయంత్రం తెలుగుదేశం నేతలు సందర్శించారు.. పార్టీ సీనియర్ నేత బొబ్బా గోవర్ధన్, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావుల నేతృత్వంలో ఎడ్లంక గ్రామాన్ని సందర్శించిన తెలుగుదేశం నేతలు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు గడచిన అయిదేళ్లుగా గ్రామం పూర్తిగా కోటకు గురయి పలు ఇళ్లు నదిలో కలసిపోయాయని ఆందోళన వ్యక్తం చేయగా గడచిన అయిదేళ్ల వైసీపీ పాలనలో ఎడ్లంక ప్రాంతంలో ఇసుక బుసక తవ్వకాల కారణంగా నది దిశ మార్చుకుందని, ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ కూటమి ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం చేసిందని, రాబోయే కొద్ది కాలంలో నది కోత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు గ్రామ మాజీ సర్పంచ్ పితా వెంకటేశ్వరావు,పర్చూరి దుర్గాప్రసాద్,బండే రాఘవ, కనగాల సత్యంబాబు, కొల్లూరి వాసు, మేడికొండ విజయ్, ఇమ్మనియేలు గ్రామస్థులు పాల్గొన్నారు..