నేడు అవనిగడ్డలో మీట్ యువర్ డీఎస్పీ (Meet Your SDPO every Friday)

భారత్ న్యూస్ శ్రీకాకుళం….నేడు అవనిగడ్డలో మీట్ యువర్ డీఎస్పీ (Meet Your SDPO every Friday)

— ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇకపై ప్రతి శుక్రవారం

అవనిగడ్డ : అవనిగడ్డ డిఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి శుక్రవారం మీట్ యువర్ డిఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అవనిగడ్డ డిఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారంకోసం అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి నేరుగా తనని కలిసి తమ సమస్యలు చెప్పవచ్చని, బాధితులు ఫిర్యాదులను పరిశీలించి, సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను వివరించేందుకు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.