భారత్ న్యూస్ గుంటూరు…..సింధూ నదిలో పడిన బస్సు.. ప్రయాణికులు గల్లంతు …
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు సింధూ నదిలో పడిపోయింది. జమ్మూకశ్మీర్లోని గుండేర్బర్ జిల్లాలోని జిర్పోరాకుల్లన్ వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గల్లంతైనట్లు సమాచారం. అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
