..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో నామినేటెడ్ పదవులు.. నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం!
తెలంగాణ :
నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది.
వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రతిపాదనలపై బుధవారం CM రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయి చర్చించనున్నారు.
ఈ భేటీలో పదవుల భర్తీకి సంబంధించి మరింత స్పష్టత రానుంది.
