మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర వాయిదా

…భారత్ న్యూస్ హైదరాబాద్….మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర వాయిదా

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ పాద‌యాత్ర వాయిదా పడింది. ఆగ‌స్టు 5న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేత‌లు ఢిల్లీకి వెళ్తున్న నేప‌థ్యంలో వాయిదా వేశారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాష్ట్రంలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించి.. ఈనెల 31వ తేదీ నుంచి ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పాద‌యాత్ర ప్రారంభించాల‌ని భావించారు. రాష్ట్రంలోని ఆరు ఉమ్మ‌డి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం చొప్పున ఆరు రోజులు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించారు…